కేంద్రం ప్రవేశపెట్టిన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం చేపట్టిన 'బస్సు యాత్ర' రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చేరుకుంది. యాత్రకు మద్దతుగా స్థానిక వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో.. రైతులు ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించారు.
'చట్టాలు రద్దు చేసేవరకు రైతుల పక్షాన ఉంటాం' - రైతుల ట్రాక్టర్ ర్యాలీ
దేశ రాజధాని దిల్లీలో రైతులు గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నా.. కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఇబ్రహీంపట్నంలోని సీపీఎం నేతలు మండిపడ్డారు. చట్టాలను రద్దు చేసేవరకు సీపీఎం.. రైతుల పక్షాన పోరాడుతుందని వారు స్పష్టం చేశారు.
'చట్టాలు రద్దు చేసేవరకు రైతుల పక్షాన ఉంటాం'
చట్టాలను రద్దు చేసేవరకు సీపీఎం.. రైతుల పక్షాన పోరాడుతుందని నేతలు స్పష్టం చేశారు. దేశ రాజధాని దిల్లీలో రైతులు గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నా.. కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడంలేదని వారు మండిపడ్డారు.
ఇదీ చదవండి:హైదరాబాద్లో రైతుల ర్యాలీకి హైకోర్టు అనుమతి