రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలంలోని రంగదాముల గ్రామంలో తాగునీరు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పనుల కోసం గుంతలు తవ్వి వదిలేశారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస అవసరాలకు సైతం ఇబ్బందులు పడుతున్నామన్నారు. మరో వారం రోజుల్లో ప్రసిద్ధ గోదా రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారన్నారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
15 రోజులుగా తాగడానికి చుక్కనీరు లేదు.. - shadnagar
రంగారెడ్డి జిల్లా రంగదాముల వాసులు గుక్కెడు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల నుంచి తాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
15 రోజులుగా తాగడానికి చుక్కనీరు లేదు..