ఎగువన కురుస్తోన్న వర్షానికి రంగారెడ్డి జిల్లాలోని ఉస్మాన్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఉస్మాన్ సాగర్లో 1786.175 అడుగులకు నీరు చేరింది. సాగర్లోకి 2 వేల 222 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా.. జలాశయం నీటిమట్టం 1789 అడుగులకు చేరితే గేట్లు ఎత్తుతామని జలమండలి అధికారులు తెలిపారు.
1786 అడుగులకుపైగా చేరిన ఉస్మాన్ సాగర్ నీటిమట్టం - ఉస్మాన్ సాగర్ జలాశయానికి పెరిగిన వరద నీరు
రంగారెడ్డి జిల్లాలోని ఉస్మాన్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో 1786.175 అడుగులమేర నీరు చేరింది. జలాశయం నీటిమట్టం 1789 అడుగులకు చేరితే గేట్లు ఎత్తుతామని జలమండలి అధికారులు తెలిపారు. విడుదల చేసిన నీరు మూసీలోకి చేరుతుంది. అందువల్ల నదీ పరివాహక వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు.
1786 అడుగులకుపైగా చేరిన ఉస్మాన్ సాగర్ నీటిమట్టం
ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందున మూసీ పరివాహక వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. కాగా ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులుగా ఉంది.
ఇదీ చదవండి:హైదరాబాద్లోని జంట జలాశయాల్లో వరద తగ్గుముఖం