రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని 7,8,9 వార్డుల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. చెరువు చుట్టూ ప్రక్కల ఉన్న ప్రభుత్వ భూములను స్వయంగా వెళ్లి చూశారు. ప్రాణాళిక బద్దంగా అభివృద్ధి చేయడమే పట్టణ ప్రగతి ఉద్దేశ్యమని చెప్పారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆర్డీవోను మంత్రి ఆదేశించారు.
"ప్రణాళికతో అభివృద్ధి చేయడమే పట్టణ ప్రగతి ఉద్దేశ్యం"
పట్టణ ప్రగతిలో భాగంగా రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి, పలు సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
వార్డులు పచ్చదనం, పరిశుభ్రంతో ఉండాలి: మంత్రి సబిత
మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపల్ కమిషనర్ అహ్మద్ సైఫుల్లాహ్, మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, వైస్ ఛైర్మన్ ఫర్హానా నాజ్, వైస్ ప్రెసిడెంట్ యూసుఫ్ పటేల్, ఆర్డీవో కందుకూరు రవీందర్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ రత్న కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఆ బంధం ఇక ఆపేద్దామంటే చంపేశాడు!
Last Updated : Mar 1, 2020, 11:27 PM IST