రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో పహాడి షరీఫ్ గ్రామంలో వక్ఫ్‌బోర్డుకు చెందిన 10 ఎకరాల స్థలాన్ని ఛైర్మన్ ఎండీ సలీమ్ శ్మశానవాటిక కోసం కేటాయించారు. అధికారులతో కలిసి కేటాయించిన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ముస్లింల శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయింపు - waqfboard chairmen MD. Saleem latest news
ముస్లింల సంక్షేమం కొరకు వక్ఫ్‌బోర్టు కృషి చేస్తుందని ఛైర్మన్ ఎండీ సలీమ్ పేర్కొన్నారు. పహాడి షరీఫ్ గ్రామంలో బోర్డుకు చెందిన 10 ఎకరాల స్థలాన్ని ముస్లింల శ్మశానవాటిక కోసం కోటాయించారు.
ముస్లింలకు శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయింపు
ఈ రోజు నుంచి ఇక్కడ అంతక్రియలు చేసుకోవచ్చునని తెలిపారు. ఎవరైనా డబ్బులు తీసుకున్న, కబ్జాలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు చేపడతామని హెచ్చరించారు. ముస్లింల సంక్షేమం కొరకు వక్ఫ్‌బోర్టు కృషి చేస్తుందని వెల్లడించారు.