కరోనా వైరస్ పట్ల ఆర్టీసీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు ఆరంభించారు. రంగారెడ్డి రీజీయన్ పరిధిలోని అన్ని బస్సుల్లో ఆ వైరస్ సోకకుండా శుభ్రం చేయిస్తున్నామని రంగారెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్ వివరించారు. కెమికల్, ఆల్కాహాల్ లిక్విడ్లతో బస్సు లోపల, బయట, ప్రయాణికులు ఉపయోగించే డోర్, హ్యండిల్, బస్సు ఫ్లోర్లను తుడిపిస్తున్నామని పేర్కొన్నారు.
కరోనా వైరస్‌పై అప్రమత్తమైన ఆర్టీసీ - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
కరోనా వైరస్ రాష్ట్రంలో ప్రవేశించడం పట్ల ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా ఆర్టీసీ అధికారులు ముందుగా జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. బస్సు లోపల, బయట, అన్ని ప్రధాన బస్ స్టేషన్లలోని బెంచీలు, కుర్చీలను సైతం శుభ్రం చేయిస్తున్నామని రంగారెడ్డి జిల్లా పరిధిలోని అధికారులు తెలిపారు.
కరోనా వైరస్‌పై అప్రమత్తమైన ఆర్టీసీ
అన్ని ప్రధాన బస్ స్టేషన్లలోని బెంచీలు, కుర్చీలను సైతం శుభ్రం చేయిస్తున్నామని తెలిపారు. కరోనా విషయంలో ఎటవంటి అపోహలకు గురికావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :ఆరోగ్య ఉపకేంద్రం ఎదుట కుటుంబ సభ్యుల పడిగాపులు