రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలికలో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. 12 వార్డులకు జరిగే ఎన్నికల్లో 8,136 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 12 వార్డులకుగానూ 47 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. కొత్తూరులో మధ్యాహ్నం 1 వరకు 65.05 శాతం ఓటింగ్ రికార్డైంది.
కొత్తూరులో మధ్యాహ్నం 1 వరకు 65.05 శాతం పోలింగ్ - telangana latest news
కొత్తూరులో పుర పోలింగ్ కొనసాగుతోంది. 12 వార్డులకు జరిగే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కొత్తూరులో మధ్యాహ్నం 1 వరకు 65.05 శాతం పోలింగ్ నమోదైంది.
![కొత్తూరులో మధ్యాహ్నం 1 వరకు 65.05 శాతం పోలింగ్ voting process is Ongoing in Kothur rangareddy telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11588465-810-11588465-1619757507558.jpg)
కొత్తూరులో మధ్యాహ్నం 1 వరకు 65.05 శాతం పోలింగ్
అలంపూర్ మున్సిపాలిటీలో 5వ వార్డుకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. నామపత్రం దాఖలు చేసిన ఏకైక అభ్యర్థి ఎరుకలి లక్ష్మీదేవమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇదీ చూడండి :గ్రామాల్లో స్వీయ నిర్బంధం... పట్టణాల్లో ఆంక్షలు
Last Updated : Apr 30, 2021, 2:17 PM IST