తెలంగాణ

telangana

ETV Bharat / state

మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము - corona news in rangareddy district

కరోనా దృష్ట్యా స్వీయ నిర్బంధం చేసుకుంటున్న ప్రజలు... వైరస్​ వ్యాప్తి ఆగకపోవడం వల్ల ఊళ్ల నిర్బంధానికి పూనుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు తమ ఊళ్లోంచి ఎవరూ వెళ్లకుండా.. బయటి వాళ్లు రాకుండా దారికి అడ్డంగా ముళ్ల కంపలు ఏర్పాటు చేశారు.

abdullapurmet mandal
మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము

By

Published : Mar 24, 2020, 9:54 AM IST

Updated : Mar 24, 2020, 10:50 AM IST

కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న లాక్​డౌన్​​ నిర్ణయానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఎవరికి వాళ్లే స్వీయ నిర్బంధం చేసుకునే వాళ్లు కొందరైతే... ఊరు దాటి పోకుండా.. వేరే ఊరోళ్లు తమ గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకునే వాళ్లు ఇంకొందరు.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​ మెట్​ మండలంలోని తారామతిపేట్​, మజీద్​పూర్​ గ్రామాల ప్రజలు వేరే ఊళ్ల నుంచి తమ గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. రోడ్డుపై ముళ్ల కంపలు అడ్డుపెట్టారు.

మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము

ఇదీ చూడండి:కరోనాపై పోరులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..

Last Updated : Mar 24, 2020, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details