రంగారెడ్డి జిల్లాలో పాడి సేకరణలో వెనుకబడ్డామని... పూర్వ వైభవాన్ని సాధించేందుకు కృషి చేస్తామని విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలోని షాద్నగర్ పాల శీతల కేంద్రంలో పాడి రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష లీటర్ల సేకరణ తగ్గితే.. కేవలం రంగారెడ్డి జిల్లాలో 75 వేల లీటర్లు తగ్గిందన్నారు. జిల్లాలో పాడి పరిశ్రమకు సంబంధించిన సొసైటీలు బలహీనంగా ఉండడం వల్లనే ఈ పరిస్థితి ఎదురవుతోందని తెలిపారు.
పూర్వవైభవం సాధిస్తాం: విజయ డైరీ - vijaya dairy updates
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పాల శీతల కేంద్రంలో పాడి రైతులతో విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో పాడి సేకరణలో వెనుకబడ్డామని ఆయన వివరించారు.
విజయడైరీ సమావేశం