తెలంగాణ

telangana

ETV Bharat / state

GaddiAnnaram Fruit Market :  కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ఖాళీ... ఇవాళ అర్ధరాత్రి తాళాలు - labors protest at GaddiAnnaram market

దాదాపు 35 ఏళ్ల చరిత్ర ఉన్న గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్(Gaddi Annaram Fruit Market)​ ఈరోజు అర్ధరాత్రి నుంచి మూతపడనుంది.అక్టోబర్ 1 నుంచి బాటసింగారం లాజిస్టిక్ పార్కులో క్రయవిక్రయాలు జరిపేలా చర్యలు చేపట్టింది. అయితే.. బాటసింగారంలో విక్రయాలకు సరైన ఏర్పాట్లు చేయలేదని.. తాము కోహెడలోనే వ్యాపారం చేసుకుంటామని వర్తకులు చెబుతున్నారు.

ఇవాళ అర్ధరాత్రి గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు తాళాలు
ఇవాళ అర్ధరాత్రి గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు తాళాలు

By

Published : Sep 25, 2021, 3:26 PM IST

ఇవాళ అర్ధరాత్రి గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు తాళాలు

మూడున్నర దశాబ్ధాల చరిత్ర ఉన్న గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌(Gaddi Annaram Fruit Market)​ ఇవాళ అర్ధరాత్రి నుంచి మూతపడనుంది. అక్టోబరు 1 నుంచి బాటసింగారం లాజిస్టిక్ పార్కులో క్రయ విక్రయాలు జరిపేలా చర్యలు చేపట్టింది.

ఈ నెల 30 లోగా గడ్డిఅన్నారం మార్కెట్(Gaddi Annaram Fruit Market)​ ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.....బాటసింగారం వెళ్లేందుకు కమీషన్ ఏజెంట్లు ఒప్పుకోవటం లేదు. ప్రభుత్వ నిర్ణయంతో వర్తకులు, హమాలీల్లో ఆందోళన నెలకొంది.

"బాటసింగారం మార్కెట్ సక్రమంగా లేదు. కోహెడ మార్కెట్​లో తాత్కాలిక ఏర్పాట్లు చేయండి. మార్కెట్ నిర్మాణం పూర్తయ్యాక కోహెడ నుంచి బాటసింగారానికి వెళ్తాం. అప్పటివరకు ఇక్కడే వ్యాపారం చేసుకుంటాం. మా గోడు వినకుండా.. మమ్మల్ని పట్టించుకోకుండా.. మా గురించి ఆలోచించకుండా వారికి వారే నిర్ణయాలు తీసుకున్నారు. మా గురించి ఆలోచన చేయలేదు. మేం ఎలా బతకాలి."

- వర్తకులు

"ఆస్పత్రి నిర్మించడం సంతోషకర విషయం. దానికి మేం అడ్డు చెప్పం. కానీ ఆస్పత్రి నిర్మించడానికి చాలా సమయం పడుతుంది. బాటసింగారానికి వెళ్లమని చెబుతున్నారు. అక్కడ సరైన వసతులు లేవు. కనీసం షెడ్లు కూడా లేవు. వర్షాలు వస్తే తలదాచుకోవడానికి, కూరగాయలు, సామగ్రి దాచిపెట్టడానికి అనుకూలంగా లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే మేం బాటసింగారానికి వెళ్లడానికి సిద్ధమే. కానీ ఎలాంటి ఏర్పాట్లు లేకుండా అక్కడికి తరలిస్తే మాత్రం మేం వెళ్లం. కోహెడలోనే మా వ్యాపారం కొనసాగిస్తాం."

- వర్తకులు

ABOUT THE AUTHOR

...view details