లాక్డౌన్ వల్ల ఆస్పత్రులకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న రోగులు, వృద్ధులు, గర్భిణీల కోసం రాచకొండ పోలీసులు కల్పించిన వాహన సౌకర్యాన్ని సుమారు 52 మంది వినియోగించుకున్నారు. శ్రీనివాస ట్రావెల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ 5 వాహనాలను గత రెండు వారాలుగా ఉపయోగిస్తున్నారు.
సరిపోకపోతే మరిన్ని వాహనాలు...
ఇప్పటివరకు ఎల్బీనగర్, ఆదిభట్ల, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, వనస్థలిపురం ప్రాంతాల్లో వాహనాలను అందుబాటులో ఉంచారు. ఈ వాహనాలను ఉపయోగించి డయాలసిస్ రోగులు, గర్భిణీలు, ఇతర రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని వృద్ధులకు నిత్యావసర సరుకులతో పాటు ఔషధాలనూ శ్రీనివాస ట్రావెల్స్ సహకారంతో పోలీసులు అందిస్తున్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని వాహనాలను పెంచే యోచిస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి : క్షౌరశాలలు లేకుంటేనేం.. మీకు నేనున్నానంటున్న మహిళ.!