లాక్డౌన్ను లెక్కచేయకుండా తిరుగుతున్న వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపైకి వచ్చిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అత్యవసర సమయంలో తప్ప ఇంటి నుండి బయటికి రాకూడదని ట్రైనీ ఐపీఎస్ స్నేహ మొహారా ఆదేశించారు.
సాగర్ రహదారిపై 25 వాహనాలు సీజ్ - తెలంగాణ లాక్డౌన్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై 25 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. లాక్డౌన్ను లెక్కచేయకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అత్యవసర సమయంలో తప్ప బయటకు రావద్దని సూచించారు.

సాగర్ రహదారిపై 25 వాహనాలు సీజ్
నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న 25 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ప్రభుత్వం ఎంతచెప్పినా ప్రజలు మాత్రం రోడ్లపైకి వస్తున్న తరుణంలో పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
సాగర్ రహదారిపై 25 వాహనాలు సీజ్