జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని వనస్థలిపురం డివిజన్ భాజపా అభ్యర్థి వెంకటేశ్వర్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు కావలసిన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, కరెంటు మొదలైన కనీస సదుపాయాలు సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని ఇంటింటి ప్రచారంలో ఆయన వెల్లడించారు. కాలనీల అభివృద్ధి సంఘానికి జేఏసీ కన్వీనర్‌గా, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా కొన్నేళ్లుగా పనిచేసిన అనుభవంతో డివిజన్‌ను మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
అనుభవం ఉంది... మరింత అభివృద్ధి చేస్తా: భాజపా అభ్యర్థి - భాజపా అభ్యర్థి ప్రచారం
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం డివిజన్లో ఇంటింటి ప్రచారంలో భాజపా అభ్యర్థి వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. కాలనీల్లో మౌలిక వసతులను కల్పిస్తానని హామీ ఇచ్చారు. గతంలో అనుభవం ఉన్న తనను గెలిపిస్తే... డివిజన్‌ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు.
అనుభవం ఉంది... మరింత అభివృద్ధి చేస్తా: భాజపా అభ్యర్థి
కాలనీపై అవగాహన ఉన్న తనకు ఓటు వేసి గెలిపిస్తే... అభివృద్ధి చేసి చూపిస్తానని, ఒక్కసారి అవకాశమివ్వాలని అభ్యర్థించారు. ప్రజల నుంచి భాజపాకు మంచి స్పందన వస్తోందని తెలిపారు.
ఇదీ చదవండి:ఆరేళ్లలో భాజపా తెలంగాణకు చేసింది సున్నా : కేటీఆర్