రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామ పంచాయితీల్లో 2500 కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. తలకొండపల్లి మండల కేంద్రంతో పాటు హర్యానాయక్ తండా, తుమ్మల కుంట తండా, సూర్య తండా, లక్ష్మీ తండా, చీకటి కుంట తండా, బద్నాపూర్, చీపు నుంతల, చెన్నారంలో కిరణా సామగ్రి అందించారు.
తలకొండపల్లి పరిధిలో 2500 కుటుంబాలకు సరకుల పంపిణీ - UPPALA CHARITABLE TRUST RANGAREDDY DISTRICT
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2500 కుటుంబాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిరాణా సామగ్రి పంపిణీ
ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యుడు ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో 10 రకాల కూరగాయలు, నిత్యావసర సరకులను ఇంటింటికి వెళ్లి అందజేశారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కరువై నిరుపేదల నిత్యావసర సరకులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. ఎంతో కొంత వారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఉప్పల ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.