రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడు చేవెళ్ల మండలం చాన్వళ్లి గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్‌గా గుర్తించారు. పట్టణంలోని పెరల్స్ వెంచర్ పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఉండవచ్చని పోలీసులు గుర్తించారు.
చేవెళ్లలో వ్యక్తి అనుమానాస్పద మృతి - చేవెళ్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడు మూడు రోజుల క్రితమే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
చేవెళ్లలో వ్యక్తి అనుమానాస్పద మృతి
చెట్టుకు ఉరివేసుకున్న తర్వాత కొమ్మ విరిగి ఉంటుందని భావిస్తున్నారు. మూడు రోజుల క్రితమే దుర్గా ప్రసాద్ ఉరివేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి సీఐ బాలకృష్ణ చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!
Last Updated : Jun 14, 2020, 2:16 PM IST