రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పీఎస్ పరిధిలోని వెంకటాపూర్ చెరువు సమీపంలో అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
చెరువు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి దేహం లభ్యం - వెంకటాపూర్ చెరువు దగ్గర మృతదేహం లభ్య
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన... రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పీఎస్ పరిధిలోని వెంకటాపూర్ చెరువు సమీపంలో చోటుచేసుకుంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చెరువు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి దేహం లభ్యం
ఘటన స్థలం వద్ద చేపలు పట్టే కట్టే, మద్యం సీసా దొరికాయి. మద్యం మత్తులో కింద పడి మృతి చెందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి ముఖంపై రక్తపు మరకలు, తలపైన గాయమైంది. అనుమానాస్పద మృతిగా బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:బాలికపై హోంగార్డు అత్యాచారం