Unknown Dead Boady Found in Rangareddy : హైదరాబాద్ శివారు ప్రాంతం, అక్కడక్కడ రిసార్టులు, దూరంగా పల్లెలు. అంతా ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ఊరిలో మధ్యాహ్నం ఓ దృశ్యం చూసిన ఊరి వారంతా ఆందోళనకు గురయ్యారు. తమ కళ్లెదుటే ఓ మృతదేహం కాలుతుండటమే ఇందుకు కారణం. వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారం గ్రామ రెవెన్యూలో ఉన్న డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పక్కన గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం మంటల్లో కాలిపోతున్న(Unwomen Burning in Rangareddy) సమయంలో స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చేంత వరకు ఆ మహిళ మృతదేహం కాలుతూనే ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలు ఆర్పేశారు. అప్పటికే మృతదేహం చాలావరకు కాలిపోయింది.
మంత్రాల నెపంతో మహిళ సజీవ దహనం- ఇద్దరు పిల్లల ముందే
Police Found A Woman Dead Body AT Moinabad : కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మంటల్లో కాలిపోతున్న మహిళ ఎవరు? ఎలా చనిపోయింది? ఇక్కడే చంపి తగలబెట్టారా లేదంటే వేరేచోట చంపి ఇక్కడకు తీసుకొచ్చారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పదో తరగతి విద్యార్థినిని సజీవదహనం చేసిన దుండగులు- అదే కారణమా?
Unknown woman Died Fire Incident in Rangareddy: మృతి చెందిన మహిళా మృత దేహాం పక్కన సగం కాలిన ఫోన్‌ను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్‌ను రప్పించి మరిన్ని ఆధారాల కోసం గాలిస్తున్నారు. సమీప గ్రామాల వారిని విచారిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో గత రెండు, మూడు రోజులుగా మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదు అయ్యాయా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మృతదేహం ఆనవాళ్లు లేకపోవడంతో ఈ కేసులో DNA టెస్ట్ కీలకంగా మారనుంది. DNA టెస్ట్ ద్వారా చనిపోయిన మహిళ గురించి వివరాలు తెలిసే అవకాశముందని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి త్వరలోనే వివరాలు అందిస్తామని వెల్లడించారు.
కట్నం కోసం నాలుగు నెలల గర్భిణీకి నిప్పు.. వారంపాటు నరకం అనుభవించి మృతి