Amit shah hyderabad Visit : కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. నేడు సాయంత్రం 4.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రోడ్డుమార్గంలో ముచ్చింతల్ వెళ్లనున్న అమిత్‌షా... రామానుజ విగ్రహాన్ని సందర్శంచనున్నారు. శ్రీరామనగరంలోని 108 దివ్యక్షేత్రాలు సందర్శించనున్న అమిత్ షా.. యాగశాల పూజల్లో పాల్గొననున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాత్రి 8 గంటలకు అమిత్‌షా తిరుగుపయనం కానున్నారు.
సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని
CM KCR At Muchinthal : ఆధ్మాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ముచ్చింతల్ భక్త జనసంద్రంగా మారింది. సమతా సూత్రాన్ని లోకానికి అందించిన మహానుభావుడు రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో శనివారం సాయంత్రం కీలకఘట్టం ఆవిష్కృతమైంది. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు. రామానుజాచార్యులు ముందు తరాలకు ప్రేరణగా నిలిచారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. శ్రీరామనగరంలో 108 దివ్య దేశ మందిరాల ఏర్పాటు అద్భుతమన్న ప్రధాని.. దేశమంతా తిరిగి ఆలయాలు చూసిన అనుభూతి కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. చినజీయర్ స్వామి తనతో విష్వక్సేనేష్ఠి యజ్ఞం చేయించారని.. ఆ యజ్ఞఫలం 130 కోట్ల ప్రజలకు అందాలని మోదీ కోరుకున్నారు.