చాలా రోజులుగా హైదరాబాద్‌లో అలికిడి లేని చెడ్డీ గ్యాంగ్ మళ్లీ రంగంలోకి దిగిందా? గురువారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో జరిగిన దొంగతనం చూస్తే నిజమే అనిపిస్తోంది. ఒంటిపై బనియన్, చెడ్డీ ధరించిన ఆరుగురు దుండగులు హయత్‌నగర్ ప్రాంతంలోని కుంట్లూరు వేద పాఠశాలలో విద్యార్థిని కొట్టి... మహిళలను కర్రలు, ఇనుపరాడ్లతో భయభ్రాంతులకు గురిచేసి... వారి నుంచి లక్ష రూపాయల నగదు, 11 తులాల బంగారం దోపీడీ చేశారు. ఆ తర్వాత పాఠశాల సమీపంలో ఉన్న ఇంట్లో రూ.50 వేల నగదు, 5 తులాల బంగారు అభరణాలను అపహరించారు. దొంగలంతా ఒంటి పై కేవలం చెడ్డీ మాత్రమే ధరించి ఉన్నట్టు స్థానికులు పేర్కొన్నారు.
ఆ రెండు దొంగతనాలు చేసింది చెడ్డీ గ్యాంగేనా? - హైదరాబాద్ హయత్‌నగర్‌లో చోరీ చేసిన చెడ్డీగ్యాంగ్ సీసీ కెమేరాల దృశ్యాలు
రాజధానిలో మరోమారు చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. పెద్ద అంబర్పేట్ పరిధిలోని హయత్‌నగర్‌లో ప్రజలను బెదిరించి అందినకాడికి దోచుకెళ్లారు. దుండగులు ధరించిన బనియన్, చెడ్డీ... బాధితులు చెప్పిన వివరాల ప్రకారం వాళ్లు చెడ్డీ గ్యాంగ్ సభ్యులు కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఆ రెండు దొంగతనాలు చేసింది చెడ్డీ గ్యాంగేనా?
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, వేలి ముద్ర నిపుణులు...ఆధారాలు సేకరించారు. ప్రత్యక్ష సాక్షులు, బాధితుల నుంచి సమాచారం, వాంగ్మూలం తీసుకున్నారు. కాలనీలోని ఓ ప్రైవేటు పాఠశాలకున్న సీసీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండిః ఇందూరులో చెడ్డీగ్యాంగ్ హల్చల్