అదుపుతప్పిన కారు బోల్తాపడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్గల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతులను వట్టి నాగులపల్లికి చెందిన తలపల్లి రామకృష్ణ, మటూరి శ్రీకాంత్‌గా పోలీసులు గుర్తించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌కు చెందిన వీరంతా ఓ వివాహానికి హాజరై వస్తుండగా ఘటన జరిగింది.