రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం కొహెడ్ వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగు రోడ్డుపై కారు డివైడర్ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా... నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితులు మిర్యాలగూడకు చెందిన రవీంద్రచారి కుటుంబంగా పోలీసులు గుర్తించారు. శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది.
కొహెడ వద్ద రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి - car accidents
రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదం నింపింది. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం కొహెడ వద్ద కారు డివైడర్ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా... నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు మిర్యాలగూడకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
రోడ్డు ప్రమాదం