రంగారెడ్డి జిల్లా మైలార్ దేవులపల్లి పరిధిలోని దుర్గానగర్ చౌరస్తా వద్ద బుధవారం రాత్రి ప్రమాదం జరిగింది. బైక్ మీద వెళ్తున్న ఇద్దరు యువకులు అతివేగంతో డివైడర్ను ఢీకొట్టగా... అక్కడికక్కడే వారు మృతి చెందారు.
చాంద్రాయణగుట్ట బండ్లగూడకు చెందిన మొహమ్మద్ సాజిద్, నిజాముద్దీన్... ఆరాంఘర్ నుంచి బండ్లగూడకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. అతి వేగంగా వచ్చి దుర్గానగర్ చౌరస్తా వద్ద డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాన్ని కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు గాలిలో ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు.