రోడ్డు పక్కన టీ విక్రయించే వ్యక్తి కుమార్తె నేడు బంగారు పథకం సాధించడం సంతోషంగా ఉందని సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గువాహటిలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో, జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్-2021లో రంగారెడ్డి జిల్లా నార్సింగి సాంఘిక సంక్షేమ విద్యార్థిని నందినిని ఆయన అభినందించారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో రాష్ట్రానికి రెండు స్వర్ణాలు - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో లాంగ్ జంప్, జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్-2021లో తెలంగాణకు చెందిన సాంఘిక సంక్షేమ విద్యార్థిని నందిని బంగారు పతకాలు సాధించింది. రాష్ట్రం నుంచి స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక వ్యక్తిగా ఆమె నిలిచింది.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో రాష్ట్రానికి రెండు స్వర్ణాలు
నందిని లాంగ్ జంప్, 100 మీటర్ల హార్డిల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించింది. ఈ ఏడాది ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో రాష్ట్రానికి బంగారు పతకాన్ని అందించిన ఏకైక వ్యక్తిగా ఆమె నిలిచింది.
ఇదీ చదవండి:ఎయిరోస్పేస్ హబ్‌గా తెలంగాణ: మంత్రి కేటీఆర్