రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాక్టివా స్కూటీని టిప్పర్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌కు వెళుతూ... అత్తాకోడళ్లు మృతి
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవడానికి వెళ్తున్న అత్తాకోడుళ్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ రాగన్నగూడ గేట్ వద్ద చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో అత్తాకోడళ్లు మృతి
మృతులు ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడళ్లని.. అత్త రమ, కోడలు హిమాజ కొత్తపేటలో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. రమ ఆంధ్రాబ్యాంక్‌లో ఉద్యోగినిగా పనిచేస్తున్నారని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవడానికి మన్నెగూడా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇదీ చూడండి: తూఫాన్ వాహనం బోల్తా... ఎనిమిది మందికి గాయాలు
Last Updated : Nov 23, 2019, 6:47 PM IST