తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగం వచ్చి 3నెలలు.. లంచం రూ.70 వేలు..

రెవెన్యూ శాఖలో మరో అవినీతి చేపను అనిశా అధికారులు ఎరవేసి పట్టుకున్నారు. రూ.50వేల లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్​ వీఆర్వో ఏసీబీ వలలో చిక్కుకున్నాడు.

లంచం తీసుకుంటూ దొరికిపోయిన వీఆర్వో

By

Published : Oct 4, 2019, 9:05 AM IST

లంచం తీసుకుంటూ దొరికిపోయిన వీఆర్వో

రెవెన్యూ శాఖలో మరో అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్​ వీఆర్వోగా పనిచేస్తున్న శంకర్ గుర్రంగూడ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డి అనే రైతు నుంచి ఎకరా ఇరవై గుంటల భూమి మ్యుటేషన్ విషయంలో లక్షరూపాయల లంచం డిమాండ్ చేశాడు. చివరకు 70 వేలకు బేరం కుదర్చుకున్నాడు. ఈరోజు ఆ రైతు నుంచి యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details