తెలంగాణ

telangana

ETV Bharat / state

పదవులు లేకున్నా ప్రజల పక్షాన పోరాడతా: ఎల్‌.రమణ - ఇబ్రహీంపట్నంలో ప్రచారం నిర్వహించిన తేదేపా అభ్యర్థి ఎల్.రమణ

నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు నిరంతరం కృషి చేస్తామని తెతెదేపా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్‌.రమణ వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

TTDP  MLC candidate ramana mlc election compaign in ibrahimpatnam in rangareddy district
పదవులు లేకున్నా ప్రజల పక్షాన పోరాడతా: ఎల్‌.రమణ

By

Published : Mar 5, 2021, 5:09 PM IST

పదవిలో లేకున్నా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తానని తెతెదేపా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్‌.రమణ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం మోపుతున్నాయని విమర్శించారు. ఉద్యోగాలు కల్పించడం లేదని ఆయన ఆరోపించారు. పేద ప్రజల సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు. తెరాస, భాజపాలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు కృష్ణమాచారి, జలమోని రవీందర్, జక్క రాంరెడ్డి, ఇందిరా, చక్రపాణి, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కరెంట్​ పోతోంది... జనరేటర్​ ఇవ్వండి: జీహెచ్​ఎంసీ మేయర్​

ABOUT THE AUTHOR

...view details