తెలంగాణ

telangana

ETV Bharat / state

'బాధిత కుటుంబాలకు 20 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలి' - 20 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలి

రాజేంద్రనగర్ సర్కిల్ గగన్ పహాడ్ అప్పచెరువు తెగి వరదల్లో మృతి చెందిన కుటుంబాలను టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం అందజేయాలని డిమాండ్​ చేశారు.

ttdp l ramana demand 20 lakh compensation for affected families
'బాధిత కుటుంబాలకు 20 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలి'

By

Published : Oct 22, 2020, 2:55 PM IST

'బాధిత కుటుంబాలకు 20 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలి'

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ గగన్ పహాడ్ అప్ప చెరువు తెగి వరదల్లో మృతి చెందిన కుటుంబాలను టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేసిన రమణ అనంతరం అప్పచెరువును పరిశీలించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అనేక మంది వరదల్లో మునిగి మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించినా ప్రభుత్వం అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయంలో విఫలమైందన్నారు. హైదరాబాద్ నగరంలోని అన్ని చెరువులకు మరమ్మత్తులు చేస్తామని, నాాలాలను విస్తరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టలేదని రమణ పేర్కొన్నారు.

గత జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. 30 వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తెరాస హామీలను విస్మరించిందని తెలిపారు.

వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం అందజేయాలని డిమాండ్​ చేశారు. లేదంటే ప్రగతి భవన్, జీహెచ్​ఎంసీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి :అవగాహన రాహిత్యంతోనే కేంద్రంపై విమర్శలు: కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details