రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్టాండ్‌లోకి వచ్చిన బస్సు డ్రైవర్లకు పూల దండలు వేసి... ప్రయాణికులకు పువ్వులిచ్చి ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. వికారాబాద్, తాండూరు, పరిగి, హైదరాబాద్ డిపోలో చెందిన ప్రైవేటు బస్సులు ప్రయాణికులను తరలిస్తుండగా బస్టాండ్‌లోకి వచ్చిన డ్రైవర్లకు వినూత్నంగా నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసన తెలుపుతూ ఉంటామని.. వెంటనే పరిష్కరించాలని కోరారు. తెలంగాణ పోరాటంలో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం బస్సు నడిపిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లకు పూలదండలు వేసి నిరసన
తాత్కాలిక బస్సు డ్రైవర్లకు ఆర్టీసీ కార్మికులు పూల దండలు వినూత్నంగా నిరసన తెలిపారు. తమ సమ్మెకు ప్రస్తుతం బస్సు నడిపిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండర్టర్లు సహకరించాలని కోరారు.
ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లకు పూలదండలు వేసి నిరసన