కార్మికులు గెలవడానికి ప్రయత్నిస్తుంటే, ప్రభుత్వం ఓడిపోకుండా జాగ్రత్త పడుతోందన్నారు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. కార్మికులెవరూ అధైర్యపడవద్దని త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని భరోసానిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వ పతనానికి నాంది అవుతుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ద్విచక్రవాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
'ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వ పతనానికి నాంది' - ఇబ్రహీంపట్నంలో ఆర్టీసీ కార్మికుల బైక్ ర్యాలీ
న్యాయస్థానంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలంగాణ ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు.
'ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వ పతనానికి నాంది'
42 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఇప్పటికీ చర్చలకు ఆహ్వానించడం లేదని అశ్వత్థామరెడ్డి అన్నారు. ఈ సమ్మె చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : బొమ్మ గీయాలంటే.. కుంచె అవసరం లేదు..!
Last Updated : Nov 15, 2019, 5:36 PM IST