తెలంగాణ

telangana

ETV Bharat / state

ముదిరాజ్​ ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన - rangareddy district news

రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ముదిరాజ్​ ఆత్మగౌరవ భవనానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం సుమారు 40 కులసంఘాలకు భవనాలు కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తెలిపారు.

ts ministers layed foundation stone to mudhiraj bhavan
ముదిరాజ్​ ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన

By

Published : Jan 10, 2021, 2:24 PM IST

రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ముదిరాజ్‌ ఆత్మగౌరవ భవనానికి.. మంత్రులు ఈటల రాజేందర్​, తలసాని శ్రీనివాసయాదవ్​, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌, ఎంపీలు కేకే, బండా ప్రకాష్‌, రంజిత్​రెడ్డి శంకుస్థాపన చేశారు.

అన్ని కులాలు, వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుండాలని తెరాస ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని మంత్రులు పేర్కొన్నారు. కులాలు ఆత్మగౌరవంగా జీవించాలనే.. సీఎం కేసీఆర్ భవనాలు నిర్మిస్తున్నారన్నారు.

జిల్లా కేంద్రాల్లో భవనాలకు స్థలాలు ఇచ్చేలా బాధ్యత తీసుకుంటానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం సుమారు 40 కులసంఘాలకు భవనాలు కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారికి మత్స్యకారులుగా ఎన్‌రోల్‌ చేసుకునే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.

త్వరలో జిల్లా కేంద్రాల్లో చేపల మార్కెట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు.చరిత్రలో ముదిరాజ్‌లకు ప్రభుత్వం తరఫున భవనం నిర్మించడం ఇదే తొలిసారిగా ఎంపీ బండ ప్రకాష్‌ పేర్కొన్నారు. ఏ కార్పొరేట్​ కార్యాలయానికి తీసిపోని విధంగా భవంతిని నిర్మించుకుంటామన్నారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించిందన్నారు. రెండేళ్లల్లో రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ముదిరాజ్ భవనం నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

ముదిరాజ్​ ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన

ఇవీచూడండి:సాంకేతికతతో సాయం.. ఈ సంస్థల సంకల్పం

ABOUT THE AUTHOR

...view details