తెలంగాణ

telangana

ETV Bharat / state

రంగారెడ్డి జిల్లా కార్పొరేషన్లలో దూసుకుపోయిన కారు - బండ్లగూడ జాగీర్‌, మీర్‌పేట కార్పొరేషన్లలో తెరాస విజయం

రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లలో కారు జోరు కొనసాగుతోంది. బండ్లగూడ జాగీర్‌ లో 22 డివిజన్లకు గానూ 14 స్థానాల్లో తెరాస విజయం సాధించింది. మీర్‌పేట్‌లో 46 డివిజన్లకు గానూ 19 స్థానాలను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది.

trs won majority divisions in rangareddy district corporations
రంగారెడ్డి జిల్లా కార్పొరేషన్లలో దూసుకుపోయిన కారు

By

Published : Jan 25, 2020, 4:25 PM IST

తెలంగాణ వ్యాప్తంగా పురపాలికలతో పాటు 9 స్థానాలకు జరిగిన నగరపాలక సంస్థల ఫలితాల్లో తెరాస హవా కనిపిస్తోంది. బండ్లగూడ జాగీర్‌, మీర్‌పేట కార్పొరేషన్లలో గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.

బండ్లగూడ నగరపాలిక పరిధిలోని 22 డివిజన్లలో తెరాస 14 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 5, భాజపా రెండు, ఒక డివిజన్‌లో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు.

మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలో 46 డివిజన్లలో 19 స్థానాల్లో తెరాస విజయం సాధించింది. మూడింట కాంగ్రెస్, 16 స్థానాల్లో భాజపా, 8 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.

ఆయా కార్పొరేషన్లలో కారు జోరుకు తెరాస శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details