ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సభ్యత్వ నమోదు చేయించాలని నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములు సూచించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగులూర్లోని ఓ ఫంక్షన్హాల్లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. మొదటి సభ్యత్వాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు.
ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు : పి.రాములు - ఇబ్రహీంపట్నం మండలం బొంగులూర్లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం
రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పి.రాములు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదటి సభ్యత్వాన్ని శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తీసుకున్నారు.
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి అందజేస్తున్న సభ్యత్వం అందజేస్తున్న ఎంపీ రాములు
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎంపీ రాములు అన్నారు. కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నియోజకవర్గంలో 74 వేల సభ్యత్వాలే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఎంపీ, ఎమ్మెల్యే పేర్కొన్నారు.