తెలంగాణ

telangana

ETV Bharat / state

కారుకు దీటైన పోటీ ఇచ్చిన కమలం, కాంగ్రెస్​ - municipal Elections in telangana

పురపాలక ఫలితాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మిశ్రమ ఫ‌లితాలు వ‌చ్చాయి.  కొన్ని చోట్ల కారు దూసుకెళ్లినా.. మరికొన్ని చోట్ల గట్టి పోటీని ఎదుర్కొంది. మీర్‌పేట‌, బ‌డంగ్‌పేట‌ కార్పొరేషన్లలో తెరాసకు భాజపా గ‌ట్టిపోటి ఇచ్చింది. ఆదిభట్ల, పెద్దఅంబ‌ర్‌పేట‌, తుర్కయాంజాల్‌లో కాంగ్రెస్​, తుక్కుగూడ‌, ఆమ‌న్‌గ‌ల్​లో కమలం, జల్​పల్లిలో ఎంఐఎం  విజయం సాధించాయి. మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తెరాస జయకేతనం ఎగురవేసింది.

trs party in municipal Elections
కారుకు దీటైన పోటీ ఇచ్చిన కమలం, కాంగ్రెస్​

By

Published : Jan 26, 2020, 7:11 AM IST

కారుకు దీటైన పోటీ ఇచ్చిన కమలం, కాంగ్రెస్​

ఉమ్మడి రంగారెడ్డిలో కారు స్పీడ్​ కాస్త బ్రేక్​ పడింది. చాలా చోట్ల గులాబీ సత్తా చాటినా కొన్ని గట్టి పోటీని ఎదుర్కొంది. మరికొన్ని చోట్ల ఓటమి చవిచూసింది. పీర్జాదిగూడ‌, బోడుప్పల్‌, నిజాంపేట‌, జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో మేయ‌ర్ ఎన్నిక‌కు అవ‌స‌ర‌మైన సీట్లను తెరాస సాధించింది. గుండ్లపోచంప‌ల్లి, మేడ్చల్‌, నాగారం, ద‌మ్మాయిగూడ‌, కొంప‌ల్లి, దుండిగ‌ల్‌, తుంకుంట‌, పోచారం, ఘ‌ట్‌కేస‌ర్ పురపాలక సంఘాల్లో ఎక్స్ అఫిషియో ఓట్లు అవసరం లేకుండానే తెరాస మున్సిప‌ల్ ఛైర్మన్ స్థానాల‌ను కైవ‌సం చేసుకునే అవకాశం ఉంది.

మీర్‌పేట‌, బ‌డంగ్‌పేట‌లో పోటాపోటీ

బండ్ల‌గూడ కార్పొరేష‌న్​ను గులాబీ పార్టీ ఖాతాలోకి వెళ్లింది. మీర్‌పేట‌, బ‌డంగ్‌పేట‌లో తెరాసకు భాజపా గ‌ట్టిపోటి ఇచ్చింది. మీర్‌పేట‌లో తెరాస, భాజపా మ‌ధ్య హోరాహోరీ పోరు సాగింది. స్వతంత్రుల స‌హకారంతో మీర్‌పేట‌, బడంగ్‌పేట కార్పొరేష‌న్లలో మేయ‌ర్ పీఠం తెరాస కైవ‌సం చేసుకునే అవ‌కాశాలు ఉన్నట్లు తెరాస శ్రేణులు భావిస్తున్నాయి.

తుక్కుగూడ‌, ఆమ‌న్‌గ‌ల్ భాజపా

ఆదిభ‌ట్ల, పెద్దఅంబ‌ర్‌పేట‌, తుర్కయాంజాల్‌లో కాంగ్రెస్ విజ‌యం సాధించి ఉనికి చాటుకుంది. నార్సింగి, మ‌ణికొండ‌లో తెరాస కంటే ఎక్కువ వార్డులు గెలిచినా కాంగ్రెస్ ఛైర్మన్ స్థానం గెలిచే అవ‌కాశాలు లేవు. తుక్కుగూడ‌, ఆమ‌న్‌గ‌ల్ మున్సిపాలిటీల్లో క‌మల‌నాథులు విజ‌యం సాధించారు. జ‌ల్‌ప‌ల్లి మున్సిపాలిటీలో ఎంఐఎం ప‌ట్టు నిలుపుకుంది. తెరాస స‌హ‌కారంతో జ‌ల్‌ప‌ల్లి ఛైర్మన్ స్థానాన్ని ఎంఐఎం కైవ‌సం చేసుకునే అవకాశం ఉంది.

వికారాబాద్​, పరిగిలో గులాబీ విక‌సించింది. కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్​లో కాంగ్రెస్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. కొడంగ‌ల్‌లో రెండు సీట్లనే కాంగ్రెస్ స‌రిపెట్టుకుంటే..తెరాస 10 స్థానాలు కైవసం చేసుకుంది. తాండూరులో 17 వార్డుల‌ను గెలిచిన తెరాస అక్కడ మిత్ర పక్షం ఎంఐఎంతో జతకట్టే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​కు ఓటరు అవగాహన అవార్డు!

ABOUT THE AUTHOR

...view details