రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే భాజపా అసత్య ఆరోపణలు చేస్తోందని తెరాస ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. ఇలాంటివి మరోసారి చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. వచ్చే 20 ఏళ్లు తెరాస ప్రభుత్వమే ఉండబోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను కాపీకొట్టి భాజపా అధికార రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని ఆరోపించారు.
' అభివృద్ధి చూసి ఓర్వలేకే భాజపా ఆరోపణలు చేస్తోంది' - MLC SAMBHIPUR RAJU
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌పై తెరాస ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు విమర్శలు గుప్పించారు. భాజపా నేతలు సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై చేసిన ఆరోపణలను ఖండించారు. రాబోయే 20 ఏళ్లు రాష్ట్రంలో తెరాసయే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు.
' తెరాస చేస్తున్న అభివృద్ధి చూడలేకే భాజపా ఆరోపణలు చేస్తోంది'