ఆరేళ్లు ఎమ్మెల్సీగా రాంచందర్ రావు చేసింది శూన్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని విద్యార్థులను కోరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఓటేసేముందు ఒక్కసారి ఆలోచించండి: మంచిరెడ్డి కిషన్ రెడ్డి - ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రచారం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఆలోచించి ఓటేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సూచించారు. కరోనా సమయంలో ఆదాయం లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎక్కడ ఆపలేదన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో సమావేశం నిర్వహించారు.
ఓటేసేముందు ఒక్కసారి ఆలోచించండి: మంచిరెడ్డి కిషన్ రెడ్డి
రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల గురించి విద్యార్థులకు వివరించారు. కరోనాతో రాష్ట్రం కోట్ల ఆదాయం కోల్పోయిన సంక్షేమ పథకాలను మాత్రం ఏక్కడా ఆపలేదన్నారు. తెరాస అభ్యర్థి సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.