TRS Mayor joins congress: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని తెరాస నేతలు అబద్ధాలు చెప్పారని టీపీసీసీ రేవంత్ రెడ్డి విమర్శించారు. భాజపా, తెరాసలు కలిసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. దిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో బడంగ్పేట్ మేయర్‌తో పారిజాతతో సహా పలువురు తెరాస నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇతర నాయకుల మాదిరిగా సముచిత స్థానం ఉంటుందని తెలిపారు.
తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని రాహుల్ గాంధీ చెప్పారు. ఇతర నాయకుల మాదిరిగా సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. సోనియా, రాహుల్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించాం. మోదీ హయాంలో విదేశాల నుంచి దేశానికి రక్షణ లేకుండా పోయింది.
- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
కాంగ్రెస్ గూటికి తెరాస మేయర్.. రాహుల్ సమక్షంలో చేరిక
తెరాస హయాంలో ప్రజా సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి. సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నా. కాంగ్రెస్ సీనియర్ నేతల సహకారంతో అభివృద్ధి కోసం కృషిచేస్తా. గతంలోనూ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశా. తిరిగి సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉంది. - పారిజాత, బడంగ్పేట్ మేయర్
రాష్ట్రంలో కనీసం రహదారులపై గుంతలు పడితే పూడ్చలేని పరిస్థితిలో ప్రభుత్వముందని రేవంత్ ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని రాహుల్ గాంధీ చెప్పారని వెల్లడించారు. సోనియా, రాహుల్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మోదీ హయాంలో విదేశాల నుంచి దేశానికి రక్షణ లేకుండా పోయిందని రేవంత్ మండిపడ్డారు. రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతిందని.. తెలంగాణ అప్పుల పాలైందని విమర్శించారు.
ఇవీ చదవండి:పోలీస్ అభ్యర్థులకు అలర్ట్... ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల తేదీలివే..
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. సోనూసూద్ మ్యాజిక్‌తో చౌముఖికి కొత్త లైఫ్