రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మున్సిపాలిటీలోని 28వ వార్డు కౌన్సిలర్ ఉపఎన్నికలో పోటీకి తెరాస దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ ఉపఎన్నికల ఏకగ్రీవం కోసం ఎంఐఎం పార్టీ చేసిన విజ్ఞప్తితో గులాబీ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్ హైమద్ పాషా ఖాద్రీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ ప్రతినిధుల బృందం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. కౌన్సిలర్ నాజియా బేగం మృతి చెందడంతో ఆమె స్థానంలో వారి కోడలు తైసీమ్ బేగంకు మద్దతు తెలపాలని కోరారు.
జల్‌పల్లి మున్సిపాలిటీలోని 28వ వార్డు ఉపఎన్నికకు తెరాస దూరం - telangana varthalu
జల్‌పల్లి మున్సిపాలిటీలోని 28వ వార్డు కౌన్సిలర్ ఉపఎన్నికలో పోటీకి తెరాస దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఏకగ్రీవం కోసం ఎంఐఎం పార్టీ చేసిన విజ్ఞప్తితో తెరాస ఈ నిర్ణయం తీసుకుంది.

జల్‌పల్లి మున్సిపాలిటీలోని 28వ వార్డు ఉపఎన్నికకు తెరాస దూరం
ఈ మేరకు ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతి మేరకు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు మంత్రి సబితా ప్రకటించారు. తెరాస నిర్ణయం పట్ల ఎమ్మెల్యే పాషా ఖాద్రి, జల్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్‌తో పాటు అభ్యర్థి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: జీహెచ్ఎంసీలో రానున్న 4 రోజులు శానిటైజేషన్: కేటీఆర్
Last Updated : Apr 18, 2021, 5:38 PM IST