మాదాపూర్ డివిజన్లో 70 శాతం పనులు పూర్తయ్యాయని... మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తానని కార్పొరేటర్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మాదాపూర్ డివిజన్లోని అయ్యప్ప సొసైటీ, సాయి నగర్, మెగాహిల్స్ కాలనీలలో ఆయన పాదయాత్ర చేపట్టారు.
ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయి: తెరాస అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్ - హైదరాబాద్ పౌర ఎన్నికలు
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మాదాపూర్ డివిజన్ పరిధిలో తెరాస కార్పొరేటర్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.

'తెరాస ప్రవేశపెట్టిన పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి'
తెరాస ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయన్నారు. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. అభివృద్ధి కోసం కారు గుర్తుకే ఓటేయాలన్నారు.
'తెరాస ప్రవేశపెట్టిన పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి'
ఇదీ చదవండి:మోదీ పర్యటన గురించి నాకు సమాచారమివ్వలేదు: రేవంత్