తెలంగాణ

telangana

ETV Bharat / state

కొండా విశ్వేశ్వర్​ రెడ్డిపై ఈసీకి తెరాస ఫిర్యాదు - konda visweshwer reddy

చేవెళ్ల కాంగ్రెస్​ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డిపై తెరాస ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బహిరంగంగా డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ తెరాస నేతలు అరికెపూడి గాంధీ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డిలతో పాటు తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​కుమార్​ను కలిశారు. తగు చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చారని వారు వెల్లడించారు.

కొండా విశ్వేశ్వర రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు

By

Published : Apr 11, 2019, 5:19 AM IST

బహిరంగంగా డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై తెరాస ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్​ను కలిసిన తెరాస నేతలు అరికెపూడి గాంధీ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
కొండా విశ్వేశ్వర్​ రెడ్డికి చెందిన 10 లక్షల రూపాయలు దొరికాయని...వాటితో పాటు చేవెళ్ల అసెంబ్లీకి 10 కోట్లు, పార్లమెంట్ స్థానానికి 70 కోట్లు ఖర్చు పెట్టాలన్న వివరాలతో కూడిన పత్రాలు లభ్యమయ్యాయని వారు తెలిపారు. తన డబ్బులు కావంటూ విశ్వేశ్వర్ రెడ్డి దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెరాస నేతలు ఆక్షేపించారు.
తన సమీప బంధువు సందీప్ రెడ్డి వద్ద 10 లక్షల రూపాయలు మాత్రమే దొరికాయని స్వయంగా అంగీకరించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రజత్​ కుమార్​ను కోరారు తెరాస నేతలు. పోలీసుల నుంచి నివేదిక తెప్పించుకొని తగు చర్యలు తీసుకుంటానని సీఈఓ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

కొండా విశ్వేశ్వర రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details