తెరాస సభ్యత్వ నమోదులో రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి పురపాలికను మొదటి స్థానంలో నిలుపుతామని మున్సిపాలిటీ తెరాస అధ్యక్షుడు ఇక్బాల్ బిన్ ఖలీఫా అన్నారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశాలతో షాహీన్ నగర్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. పార్టీని జల్‌పల్లిలో మరింత బలపరచడం, సభ్యత్వం నమోదు, తదితర అంశాలపై చర్చించారు.
'సభ్యత్వ నమోదులో జల్‌పల్లిని ప్రథమ స్థానంలో నిలుపుతాం' - జల్‌పల్లి మున్సిపాలిటీలో తెరాస సమావేశం
రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో తెరాస ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. పార్టీని మున్సిపాలిటీలో బలపరచడం, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలతో ఈ సమావేశం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.
జల్‌పల్లి మున్సిపాలిటీ
సభ్యత్వ నమోదులో గతేడాది జల్‌పల్లి మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో ఉందని.. ఈ సారి మొదటి స్థానం దక్కేలా 20వేల సభ్యత్వ నమోదుకు కృషి చేస్తామని అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సయ్యద్ యూసుఫ్ పటేల్, కార్యకర్తలు లక్ష్మీ నారాయణ, శంకర్, బాషమ్మ, సౌద్ అవల్గి , ఖలేద్ మారుస్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'తెరాస సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి'