శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ కుటుంసభ్యులు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విస్తృత ప్రచారంలో పాల్గొన్నారు. చందానగర్ డివిజన్లో పర్యటించి తెరాస అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు సూచించారు.
డివిజన్ ప్రజలందరికీ అందుబాటులో ఉంటా: తెరాస అభ్యర్థి - జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస ప్రచారం
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కుటుంబసభ్యులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చందానగర్ డివిజన్లో పర్యటించి అభ్యర్థి మంజులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
డివిజన్ ప్రజలందరికీ అందుబాటులో ఉంటా: తెరాస అభ్యర్థి
తెరాస ప్రభుత్వం మహిళల కోసం, పేదవర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ఆదుకుంటుందని తెలిపారు. కేసీఆర్ లాంటి నాయకుడు మనకు ఉండడం అదృష్టమని పేర్కొన్నారు. తెరాసని అత్యధిక మెజార్టీతో గెలిపించి డివిజన్ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. డివిజన్ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అభ్యర్థి మంజుల హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:'కేంద్రమంత్రులరా వెల్కం టూ హైదరాబాద్... పైసలు తీసుకొనిరండి'