విద్వేషాలు పెరిగిపోయిన ప్రస్తుత సమాజానికి రామానుజాచార్యుల సమతా సిద్ధాంతం అత్యవసరమని చినజీయర్ స్వామి (Tridandi Chinajiyarswamy) అభిప్రాయపడ్డారు. నేటి నుంచి తమ ఆశ్రమంలో చాతుర్మాస దీక్ష ప్రారంభిస్తునట్లు త్రిదండి చినజీయర్‌స్వామి ప్రకటించారు. 2022 ఫిబ్రవరి 5న ప్రధాని(pm modi) చేతుల మీదుగా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ చేయనున్నట్లు త్రిదండి చినజీయర్‌స్వామి ప్రకటించారు. ఫిబ్రవరి 2-14 వరకు సమతామూర్తి కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఫిబ్రవరి 14న పూర్ణాహుతిలో రాష్ట్రపతి (president) పాల్గొంటారన్నారు.
రామానుజాచార్యులు సమసమాజ స్థాపనకు పూనుకున్నారని చినజీయర్ స్వామి అన్నారు. శ్రీరామానుజాచార్యులకు వెయ్యేళ్లు పూర్తయ్యాయని... సమతా సిద్ధాంతాన్ని రామానుజులు లోకానికి చాటారని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. ఫిబ్రవరిలో 12 రోజులపాటు రామానుజాచార్యుల ఉత్సవాలు నిర్వహిస్తామని... రూ. 1200 కోట్లకుపైగా వ్యయంతో ప్రపంచంలో రెండో అతిపెద్ద పంచలోహ విగ్రహం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.