రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు శుక్రవారం నివాళులర్పించారు. వారి చిత్రపటాల వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కిస్మత్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మాజీ సైనికుడు సుధాకర్ పాల్గొని అమర జవాన్ల త్యాగాలు కొనియాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి మౌనం పాటించారు. నార్సింగిలో పుల్వామా అమరవీరులను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
పుల్వామా అమరవీరులకు ఘనంగా నివాళులు - Tributes to the Pulwama Martyrs in kismatpura
గతేడాది పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్, నార్సింగి ప్రాంతాల్లో శుక్రవారం నివాళులర్పించారు.
![పుల్వామా అమరవీరులకు ఘనంగా నివాళులు Tributes to the Pulwama Martyrs in kismatpura](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6078283-thumbnail-3x2-army.jpg)
పుల్వామా అమరవీరులకు ఘనంగా నివాళులు