తెలంగాణ

telangana

ETV Bharat / state

మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డికి ఘన నివాళులు - మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి

సీఎం కేసీఆర్ నేతృత్వంలో.. రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు. మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి 21వ వర్ధంతిని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని.. ఆయన విగహ్రానికి ఘన నివాళులర్పించారు.

home minister sabita indra reddy
home minister sabita indra reddy

By

Published : Apr 22, 2021, 5:27 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి 21వ వర్ధంతిని పురస్కరించుకుని.. ఇంద్రారెడ్డి నగర్​లోని ఆయన విగహ్రానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు.

ప్రత్యేక రాష్ట్రం.. ఇంద్రారెడ్డి కల అని గుర్తు చేస్తూ, వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని సబితా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో.. రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతోందని వివరించారు. కౌకుంట్లలోని ఇంద్రారెడ్డి సమాధి వద్ద.. కుమారులు ఇతర కుటుంబసభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు.. జోహార్ ఇంద్రన్న అంటూ నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు వర్షాలు

ABOUT THE AUTHOR

...view details