మీర్పేట్లో అరెస్టయిన నకిలీ వైద్యుడు సాయికుమార్‌తో చికిత్స అందించారంటూ ఎల్బీనగర్లోని ఆరెంజ్ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నకిలీ డాక్టర్‌తో వైద్యం.. ఆందోళనకు దిగిన బంధువులు - రంగారెడ్డి జిల్లా వార్తలు
నకిలీ వైద్యునితో చికిత్స అందించిన ఉదంతం ఎల్బీనగర్లో వెలుగుచూసింది. ఆరెంజ్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగికి మీర్పేట్లో పట్టుబడిన నకిలీ వైద్యుడు సాయికుమార్‌తో వైద్యం అందించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నకిలీ డాక్టర్‌తో వైద్యం... ఆందోళనకు దిగిన బంధువులు
హయత్‌నగర్‌కు చెందిన బాలకిషన్ మెడికల్ ఎజెన్సీలో పనిచేస్తున్నాడు. పది రోజుల క్రితం జ్వరం రావడంతో ఎల్బీనగర్లోని ఆరెంజ్ ఆస్పత్రిలో చేరాడు. అతనికి నకిలీ వైద్యునితో చికిత్స అందించారని బంధువులు ఆరోపిస్తున్నారు. పదిరోజులకు పైగా ఇతర డాక్టర్లు వైద్యం చేసి, పరిస్థితి విషమించాక మరో ఆస్పత్రికి తరలించాలన్నారు. అతను ప్రస్తుతం మరో ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడని బంధువులు తెలిపారు.