దిల్సుఖ్ నగర్‌లోని డిజిటల్ రెడీ శిక్షణా సంస్థను తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. ప్రపంచంలోనే హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారిందని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. తెలంగాణలో నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణులు ఉండటం వల్లనే సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు పోటీ పడుతున్నాయని తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థులు మారుతున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా మెలకువలు నేర్చుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో డిజిటల్ రెడీ సంస్థ డైరెక్టర్ మదన్ కుమార్, ఛైర్మన్ అంజనీ కుమార్, శ్రీలత ఎమ్.ఎన్.రావు, తదితరులు పాల్గొన్నారు.
'డిజిటల్ సాంకేతికతకు అనుగుణంగా మార్పులు రావాలి' - దిల్సుఖ్ నగర్‌లోని డిజిటల్ రెడీ శిక్షణా సంస్థ
అంతర్జాతీయ ఐటీ కేంద్రంగా హైదరాబాద్ మారిందని రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ఈ సందర్భంగా దిల్సుఖ్ నగర్‌లోని డిజిటల్ రెడీ శిక్షణా సంస్థను ప్రారంభించారు.

బీటెక్ విద్యార్థుల డిజిటల్ మార్పులకు శిక్షణ