రంగారెడ్డి జిల్లా మదన్‌పల్లిలోని గిరిజన రైతులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. సర్వే నెంబర్ 65లోని 23 గుంటల పట్టా భూమిపై కన్నేసిన రియర్ వ్యాపారులు ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమపై దాడికి పాల్పడ్డారంటూ బాధితులు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
మా భూములు, ప్రాణాలు కాపాడండి: హెచ్ఆర్సీకి బాధితుల వేడుకోలు - latest news of hydearabad
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మదన్‌పల్లి పాత తండా గ్రామంలోని గిరిజనులపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుచరులతో దాడి చేశారు. ఈ ఘటనపై తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత గిరిజన రైతులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.
మా ప్రాణాలు, భూములను కాపాడండంటూ హెచ్ఆర్సీని కలిసి గిరిజనలు
హైదరాబాద్‌కు చెందిన రియల్ వ్యాపారులు శ్రీను, వెంకటరమణ, గణేష్ రెడ్డి, కృష్ణా రెడ్డితోపాటు మరో 30 మంది వచ్చి తమ భూమి చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చేశారని.. అడ్డుకోవడానికి వచ్చిన వారిపై, మహిళలపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరికి చేతులు విరిగాయని వాపోయారు. రియల్వ్యాపారులపై తగిన చర్యలు తీసుకుని తమకు ప్రాణరక్షణ కల్పించాలని కమిషన్‌ను వేడుకున్నారు.
ఇదీ చదవండి:హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు