Ticket Prices to Visit Statue Of Equality : ముచ్చింతల్ శ్రీరామనగరం జీవాశ్రమంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించుకునే భక్తులు, సందర్శకుల కోసం ప్రవేశ రుసుములను నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. 6-12 ఏళ్ల లోపు చిన్నారులకు రూ.75, పెద్దలకు రూ.150గా ప్రవేశ రుసుములు నిర్ణయించామన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా అనుమతి కల్పిస్తామన్నారు. కొన్ని అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతున్నందున ఈ నెల 19 వరకూ మధ్యాహ్నం 3 గంటల నుంచి మాత్రమే భక్తులకు ప్రవేశం ఉంటుందని వెల్లడించారు.
Ticket Prices to Visit Statue Of Equality : సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఎంట్రీ టికెట్ ధర ఎంతంటే..? - సమతామూర్తి దర్శన టికెట్ ధర
Ticket Prices to Visit Statue Of Equality : రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన ప్రవేశ రుసుములను జీవాశ్రమం నిర్వాహకులు ప్రకటించారు. 6-12 ఏళ్ల లోపు చిన్నారులకు రూ.75, పెద్దలకు రూ.150గా ప్రవేశ రుసుములను నిర్ణయించినట్లు తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా అనుమతి కల్పిస్తామని తెలిపారు.
Statue Of Equality Visiting Ticket Prices : 19 తరువాత ఉదయం, సాయంత్రం వేళల్లోనూ భక్తులకు ప్రవేశాలు కల్పించనున్నారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలోని 120 కిలోల శ్రీరామానుజచార్యుల సువర్ణమూర్తి విగ్రహం దర్శనం, త్రీడీ మ్యాపింగ్ లేజర్ షో, ఫౌంటేన్ అందాలను తాత్కాలికంగా నిలిపివేశారు. బంగారు విగ్రహం చుట్టూ బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ ఫ్రేం ఏర్పాటు సహా ఇతరత్రా సాంకేతిక పనుల పూర్తికి మరో వారం రోజులు పడుతుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు తెలిపారు.
సంబంధిత కథనాలు