తెలంగాణ

telangana

ETV Bharat / state

'నేటి విద్యా వ్యవస్థ వ్యాపార, ధనార్జనగా మారింది' - సరితా విద్యానికేత్​ పాఠశాలను సందర్శించిన తుషార్​ అరుణ్​ గాంధీ

జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే క్రమశిక్షణతో కష్టపడి చదవాలని.. పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు మహత్మగాంధీ మనుమడు తుషార్ అరుణ్ గాంధీ సూచించారు. హయత్ నగర్​లో సరితా విద్యానికేత్ పాఠశాలను ఆయన సందర్శించారు.

Thushar Arun Gandhi visited saritha vidhyaniketh school
నేటి విద్యా వ్యవస్థ వ్యాపార, దనార్జనగా మారింది

By

Published : Dec 24, 2019, 1:16 PM IST

నవ సమాజ నిర్మాణానికి పునాది విద్యాలయాలేనని మహత్మగాంధీ మనుమడు తుషార్ అరుణ్ గాంధీ అన్నారు. హయత్ నగర్​లో సరితా విద్యానికేతన్ పాఠశాలను ఆయన సందర్శించారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే క్రమశిక్షణతో కష్టపడి చదవాలని.. పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు తెలిపారు.

పిల్లల కోసం సమయాన్ని కేటాయించి, వారితో గడపాలని తల్లిదండ్రులకు సూచించారు. నేటి విద్యా వ్యవస్థ వ్యాపార, ధనార్జనగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శమని వాటిని కాపాడాలని కోరారు.

నేటి విద్యా వ్యవస్థ వ్యాపార, దనార్జనగా మారింది

ఇవీ చూడండి :అంగన్​వాడీ కేంద్రాలను కలెక్టర్లు సందర్శించాల్సిందే: మంత్రి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details