రంగారెడ్డి జిల్లాలోని జల్పల్లిలో సినీ నటుడు మోహన్‌బాబు ఫాంహౌస్ వద్ద హల్చల్ చేసిన నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి మోహన్‌బాబు ఫాంహౌస్‌కు ఆగంతుకులు ఇన్నోవా కారు ఏపీ31ఏఎన్0004లో వచ్చి హంగామా సృష్టించారు.
మోహన్‌బాబు ఫాంహౌస్ వద్ద హల్చల్ చేసిన దుండగులు అరెస్టు - నలుగురు యువకులు అరెస్టు
మోహన్‌బాబు ఫాంహౌస్ వద్ద హంగామా సృష్టించిన నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి జల్పల్లిలోని ఫాంహౌస్‌కు ఇన్నోవా కారులో ఆగంతుకులు వచ్చి నానా హంగామా సృష్టించారు. భయాందోళన చెందిన మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మోహన్‌బాబు ఫాంహౌస్ వద్ద హల్చల్ చేసిన దుండగులు అరెస్టు
భయాందోళన చెందిన మోహన్ బాబు, అతని కుటుంబ సభ్యులు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీసీటీవీ, కార్ నంబర్ ఆధారంగా వారిని పోలీసులు పట్టుకున్నారు. మోహన్‌బాబు ఫాంహౌస్‌కు వచ్చింది మైలార్‌దేవ్‌పల్లిలోని దుర్గానగర్‌కు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. ఆగంతుకుల కాల్‌డేటాను పోలీసులు పరీశీలిస్తున్నారు.
ఇదీ చూడండి :ఉస్మానియాలో ‘చర్మనిధి ఏర్పాటుకు రంగం సిద్ధం!